Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు రవ్వల్లో నిప్పులు...కార్మికులకు లేని సౌకర్యాలు
- 45 డిగ్రీలకు చేరిన పగటి ఉష్టోగ్రతలు
- ఎండ వేడికి నిర్మానుష్యంగా మారిన రోడ్లు
- రోజురోజుకు పెరుగుతున్న సూర్యప్రతాపం...బెంబేలెత్తుతున్న ప్రజలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేసవి తీవ్రత పెరిగిపోయింది. గత రెండు రోజులుగా పెరుగుతున్న భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక పోతున్నారు. రోడ్లుపైన జనసంచారంలేక నిర్మాణుషంగా మారాయి. ఉదయం 10 గంటలకే ఎండ వేడి పెరిగిపోతుంది. గురువారం గూడెంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైయ్యాయి. కాగా పట్టణ ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతుండగా, బొగ్గుగనులు ప్రాంతాల్లో ఎండ తీవ్రంత భరించలేని విధంగా మారింది. పట్టణంలో 42 డిగ్రీల ఉషోగ్రతలు రికార్డు కాగా, సింగరేణి ఓసీ ప్రాంతాల్లో మరో 3 డిగ్రీలు అదనంగా వేడితో 45 డిగ్రీల వేడి నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది కంటే ఈ సారి ముందుగానే అత్యధిక ఉషోగ్రతలు నమోదు కావడంలో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఏప్రిల్‌లో ఇలా ఉంటే మే మాసంలో మేం ఏమైపోవాలని ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. రాబోయే రోజుల్లో ఎండల ప్రభావం మరింత పేరిగే అవకాశం ఉండగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బొగ్గు గనుల్లో అధిక ఉష్ణోగ్రతలు....
భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో అధికంగా ఎండ తీవ్రతలు కనిపిస్తు న్నాయి. పట్టణంలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఓపెన్ కాస్టుల వద్ద 45 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది. కొత్తగూడెం, మణుగూరు ఇల్లెందు, సత్తుపల్లి ఓసీల ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదవుతున్నాయని సమాచారం. కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉన్న 3, (కొత్తగూడెం-1, సత్తుపల్లి-2) ఇల్లందు పరిధిలో-1, కోయగూడెంలో-1, మణుగూరులో-3 ఓసిలు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఓసిలలో సుమారు 1450 మంది, ఇల్లందు ఏరియా పరిధిలో 340 మంది, మణుగూరులో సుమారు 1500 మంది ఓసిలలో పనిచేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కార్మికులు, సామాన్య ప్రజలలో ఆందోళన కలిగించే విధంగా నమోదు అవుతున్నాయి.
కార్మికులకు లేని సౌకర్యాలు...
రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపద్యంలో సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల వద్ద వేసవి కాలంలో ఏర్పాటు చేయాల్సిన రెస్ట్ షెల్టర్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో కార్మికులు వేసవి తీవ్రతతో లబోదిబో మంటున్నారు. పట్టణాల్లో నమోదవుతున్న 42 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే అదనంగా మరో 3 డిగ్రీల ఉష్ణోగ్రతలతో 45 డిగ్రీలు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో నమోదు అవుతున్నాయని తెలుస్తుంది.
ఉత్తర్వ్యులు జారీచేశాం : జీఎం పర్సనల్ కె.బసవయ్య
సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌న్ కాస్టు మైన్స్‌లో కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీచేశారు. సింగరేణి వ్యాప్తంగా 20 ఓపెన్ కాస్టులున్నాయి. ఇందులో 25273 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 25 భూ గర్భ గనులున్నాయి. వీటిలో 9639 మంది పనిచేస్తున్నారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, రెస్టు షెల్టర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకునే విధంగా చూస్తామన్నారు.