Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఈట కృష్ణ పార్వతి దంపతుల కుమార్తె శ్రావణి (15)కి రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. చికిత్స నిమిత్తం మొదట ఖమ్మం తర్వాత హైదరాబాద్ తీసుకువెళ్లి మెరుగైన వైద్యం, ఆపరేషన్ కూడా చేయించామని వారి తల్లిదండ్రులు తెలిపారు. కానీ డాక్టర్లు నమ్మకం చెప్పలేమంటున్నారని తెలిపారు. రెండు రోజులకు ఒకసారి సంబంధించిన రక్త పరీక్షలు, డయాలసిస్‌తో పాటు వారానికి ఒకసారి హైదరాబాద్ తీసుకువొచ్చి పరీక్షలు చెపించాల్సి ఉంటుందని సూచించారు. ఇట్టి విషయం తెలుసుకున్న (సుజాతనగర్ మండల ఐక్య బహుజన అంబేద్కర్ విగ్రహ, ఆశయ సాధన సమితి) వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.5000 ఆర్థిక సహాయం అందించారని కూలి పనులు చేసుకొని జీవనం సాగించే నిరుపేద కుటుంబానికి చెందిన మేము హాస్పిటల్లో చూపించ లేక ఇబంది పడుతున్నామన్నారు. దయవుంచి చేతనైన సహాయం అందించి మా బిడ్డను బతికించడని ఆదంపతులు వేడుకుంటున్నారు..! సహాయం చేయదలుచుకున్న వారు 9652079588 ఈ ఫోన్ నెంబర్ సంప్రదించాలన్నారు.