Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ఫిర్యాదు చేసిన వినియోగదారుడు
- రూ.15వేల జరిమానా
నవతెలంగాణ-పాల్వంచ
పట్టణంలోని బృందావన్ హౌటల్ ధనార్జనేధ్యేయంగా వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ కుల్లిన పదార్ధాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం శుక్రవారం బయటపడింది. హౌటల్కు వచ్చిన ఓ వినియోగదారుడు చికెన్ తందూరి ఆర్డర్ చేయగా వేడివేడిగా చికెన్ తందూరి తీసుకువచ్చి ఇవ్వడంతో ఆ వినియోగదారుడు తింటున్న క్రమంలో దుర్వాసనరావడంతో వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పాల్వంచ శానిటరీ ఇన్స్ఫ్క్టర్ వాణి అక్కడికి చేరుకుని అహారపదార్ధాలు తనిఖీ చేశారు. ఫ్రిజ్లో కుల్లిన పదార్ధాలు కనిపించడంతో హౌటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో హోటల్ యాజమాన్యానికి వెంటనే రూ.15 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు నమోదు అయిన కేసు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు.