Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగర పరిధిలో పలు అభివద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల నిమిత్తం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. ముందస్తు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా 10:16 గంటలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంకు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పాంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. కేటీఆర్‌కు గులాబీ నేతలు, కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, పాలేరు వైరా ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, తెలంగాణ విత్తన కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, తోపాటు వివిధ శాఖల అధికారులు, గులాబీ నేతలు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. హెలికాఫ్టర్ ద్వారా ఖమ్మానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌ను మంత్రి పువ్వాడ అజరు పక్కనే వేచిచూస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకుల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఒక్కొక్కరిని పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. నగరంలో పర్యటిస్తున్న కేటీఆర్‌కు ఖమ్మం యువత ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.