Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రతికేదెలా... ఏస్వోటు జీఎంకు కార్మికుల వినతి పత్రం
మణుగూరు: గత ఏడు నెలలుగా జీతాలు లేవని, మేము ఏలా బ్రతకాలని కార్మికులు ప్రశ్నించారు. శనివారం ఇన్ఛార్జ్ ఏస్వోటు జీఎం ఎం.రజాక్ఫాష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... సింగరేణి సోలార్ ప్లాంట్ ప్రవేటు సెక్యూరిటి గార్డులకు ఏడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు స్పందిస్తు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ప్రభాకర్‌రావు, నాసర్‌పాషా, మంగీలాల్, చల్లా కాంతారావు, దేవేందర్, క్రిష్ణా, వెంకటరాజు, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, వీరస్వామి, శ్రీనివాస్‌రావు, రవి, వెంకట్రావు, ప్రేమ్‌కుమార్, సతీష్, సదానందం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.