Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర భారత మహౌత్సవాల సంబురాలు జరుపుకోవడ గౌర్వకారణం
- జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో స్వాతంత్య్ర పోరాట యోధులతో పాటు...కవిత్వం కూడా తెల్లవారితో పోరాటం చేసిందని, ఈ ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత అమృత మహౌత్సవాల సంబురాలు జరుపుకోవడ మనందరికి గౌర్వకారణమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం జిల్లా డిఆర్డిఏ కార్యాలయ సమావేశ మందిరంలో '' స్వాతంత్య్ర భారత అమృత మహౌత్సవాల సంబురాల సందర్భంగా కవిసమ్మెళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కవిత్వం ప్రతి ఒక్కరిలో మనో విజ్ఞానాన్ని కలిగిస్తుందని తెలిపారు.రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర స్పూర్తి అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో అనేక మంది కవులు పాల్గొనడం సంతోషం అన్నారు. కవులు తమ కవితలు ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు. 15ఆగష్టు 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న శుభసందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 12వ తేదీన దండి సత్యాగ్రహం ప్రారంభం అయిన సందర్భంగా 75 వారాలు పాటు స్వాతంత్య్ర సముపార్జనలో అసువులు బాసిన మహానీయుల త్యాగాలను మననం చేసుకునేందుకు 75 వారాల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతదేశ ప్రజలు స్వేచ్చగా జీవించడానికి మనదేశానికి స్వాతంత్య సాధన ఒక్కటే మార్గమని భావించి ఎందరో మహానీయులు ఆంగ్లేయులపై పోరాటం జరిపి ప్రాణాలను ఫణంగా పెట్టి మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని చెప్పారు. మహానీయుల త్యాగాలను మననం చేసుకోవడానికి మార్చి 24వ తేదీన ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి కెఎస్ఎం కాలేజ్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
కలెక్టర్ శుభాకాంక్షలు
కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు జిల్లా కలెక్టర్డాక్టర్ ఎంవి.రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 75వ భారత స్వాతంత్య్ర మహౌత్సవాలలో భాగంగా స్వాతంత్య్ర సముపార్జనలో పాల్గొన్న మహానీయుల త్యాగాలు, భారతమాతను దాస్య శృంఖలాలు నుండి విముక్తి జరిగిన ఘట్టాలను కవులు తమ కవితా రూపంలో తెలియచేయడం చాలా సంతోషమన్నారు. 46 మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో సంతోషమని, కవులు వినిపించిన కవితలను రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖకు పంపాలని డిపిఆర్ఓ శ్రీనివాసరావును ఆదేశించారు. అనంతరం ఎంపిక చేయబడిన ఉత్తమ కవితలకు డిఆర్ఓ అశోక చక్రవర్తి జ్ఞాపిక, శాలువా ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శ్రీలం శ్రీనివాసరావు, కవులు డాక్టర్ దిలావర్, అంగోత్ శ్రీనివాస్, కటుకోజ్వల రమేష్, రాగ రాజేశ్వరి, బూడిద అరుణ్ గౌడ్, మండవ సుబ్బారావు, మొక్కల వెంకటయ్య, చాగంటి లక్ష్మీనారాయణ, కళ్యాణి, సీరా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.