Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోకడలు అబద్ధం సత్యదూరమైన ఆరోపణలను ఖండిస్తున్నాం
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి బొగ్గు లారీ కాటాకార్మికుల వేతనాల పెంపు కోసం 10న జరపతలపెట్టిన నిరవధిక సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కాటా కార్మికుల సంఘం కలిసిరావాలని ఎఫ్టియు, ఏఐటియుసి నేతలు విజ్ఞప్తి చేశారు. జనరల్ బాడీ సమావేశం ఓసి కాటా వద్ద శనివారం జరిగింది. ఈ జనరల్ బాడీ లో, దేవరకొండ శంకర్, షేక్, యాకుబ్ షావలి లు పాల్గొని మాట్లాడుతూ కాటా కార్మికుల సంఘం10వ తారీకు జరుగు సమ్మెలో పాల్గొనడం లేదనే పేరుతో అసత్యఆరోపణలు చేశారని అన్నారు. ఏకపక్షంగా కాటా కార్మిక సంఘాలు ఒంటెద్దు పోకడలు పోతున్నాయని విలేకరుల సమావేశంలో మాట్లాడారు, దీనిని ఖండిస్తున్నాం వారి ఆరోపణలు అర్థరహితం.జనవరి 5- 2021,న మూడు యూనియన్ల కాట కమిటీల సమావేశం కాటా కాడ జరిగింది, లారీ యజమానులకు లేఖ ఇవ్వాలని తీర్మానం చేశారు. ఫిబ్రవరి 27న కాటా వద్ద 3 యూనియన్ ల కమిటీ సమావేశం జరిగింది. 24,న లారీ యజమానులకు లేక ఇవ్వాలని, లెటర్ డిటిపి కూడా అయినది టిఆర్ఎస్ .కాటా మేస్త్రీ యూసుఫ్ కూడా వచ్చినాడు. లెటర్ తయారయ్యాక సంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు
కాటా దగ్గర షిఫ్ట్ లు ఎక్కి దిగేటప్పుడు, వాళ్ల మేస్త్రి లకు తెలియజేసిన ము
ఎల్లుండి వస్తాం కనుక్కొని చెబుతాం, మా లీడర్లు ఇంకేమీ మాకు తెలియజేయలేదు ఇదిగో వస్తాం అదిగో వస్తామని, కాలయాపన చేసి నారు ఇది వాస్తవం కాదా, 2018
లో, ఎగ్రిమెంట్ జరిగింది ది 2019, 2020, అగ్రిమెంట్ జరగలేదు ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన ఫలితము లేనటువంటి పరిస్థితులలో మా ఇరు సంఘాలు, కార్మికుల ఆర్థిక పరిస్థితి దష్ట్యా కార్మిక వర్గ ప్రయోజనం కోసం లారీ యజమానులకు లేఖలు ఇవ్వడం జరిగినది. ఇట్టి విషయాన్ని కూడా వారికి తెలియజేశాం గత్యంతరం లేని పరిస్థితుల్లో అనివార్యంగా సమ్మెలోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సమావేశంలో, బంధం, నాగయ్య, మోజేష్, యాకూబ్ పాషా, వెంకన్న, కృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు