Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మామ వంకెన గోపాలకృష్ణ అనారోగ్యంతో బాధ పడుతూ శనివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి తుంబురి దయాకర్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణలు మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, రైతుబంధు కమిటీ మండల కన్వీనర్ దొడ్డపనేని రామారావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురభి వెంకటప్పయ్య, దరవత్ బాబులాల్, సర్పంచ్‌లు అద్దంకి చిరంజీవి, షైక్ అబ్జల్ బీ, జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, మందపాటి వెంకటేశ్వరరావు, చీకటి రాంబాబు, పొట్లపల్లి శేషగిరిరావు, మండల నాయకులు తేజవత్ మదన్ పాల్గొన్నారు..