Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా వారి నాసా ఎయిమ్స్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్టులో 2020-21 సంవత్సరానికి గాను తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు వరుసగా ఎనిమిదో సంవత్సరం వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాయి. ప్రపంచం నలుమూలల నుండి వంద దేశాలు పాల్గొనగా అందులో భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ శ్రీ చైతన్య విద్యార్థులు నిలబెట్టారు. నాసా కాంటెస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 160 ప్రాజెక్టులలో తెలంగాణ శ్రీ చైతన్య 24 ప్రాజెక్టులు గెలుచుకొని తన సత్తా చాటింది. ఖమ్మం పట్టణంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రధమ మరియు తృతీయ బహుమతులు కైవసం చేసుకొని విద్యా రంగం లోనే తెలంగాణకు మణిహారంగా నిలిచాయి. అందులో ఖమ్మం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ''మినర్వా'' ప్రాజెక్టుకు ప్రపంచ ప్రధమ బహుమతి ''ఆర్టిఫిషియల్ ఎర్త్'' అనే ప్రాజెక్టు ప్రపంచ మూడవ బహుమతిని గెలుచుకున్నాయని పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలియజేశారు.శ్రీ చైతన్య విద్యార్థులు ''మినర్వా'' మరియు ''ఆర్టిఫిషి యల్ ఎర్త్'' అనే ప్రాజెక్టుల ద్వారా ఈ భూమ్మీద కాలుష్యంతో నివసించే మానవులకు కత్రిమ భూమిని నిర్మించి, అక్కడ అన్ని వసతులు కల్పించాలి అనే నేపథ్యంతో ఆన్లైన్ ప్రక్రియలో తమ ప్రతిభా పాటవాలతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు లో పాల్గొన్న విద్యార్థులు శ్రీజ,జాన్, ప్రకాష్, రామ్ చరణ్, రఘురాం, విశాల్ నాయక్, రిషికా చౌదరి, మనోజ్ఞ, సోహెల్, శివ కీర్తన, వంశీ ,స్నేహ రెడ్డి , పవిత్ర , రోహిత్ , అనక, విశాఖ్. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్ విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు బహు మతులను అందజేశారు. విద్యార్థులను అభినం దించారు. విద్యార్థులు చదువులతోపాటు ఇలాంటి పోటీ కాంటెస్ట్ లో పాల్గొని విజయం సాధించడం హర్షణీయమన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల కృషిని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ విద్యార్థులు చదువుతోపాటు, ఒలంపియాడ్ పరీక్షలలో, నాసా లాంటి శాస్త్ర సాంకేతిక రంగాలలో పాల్గొని విజయం సాధించడం సర్వసాధారణమని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెం పాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య, ఏజీఎం శ్రీ బాల పరమేశ్వర్ రావు, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.