Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మధిర టీవీఎం హైస్కూల్లో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్కె సైదులు అధ్యక్షతన నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష పార్టీలు, ప్రజాసంఘాలు బాధ్యులు, విద్యార్థి-యువజన సంఘాల నాయకులు ప్రైవేటు స్కూల్, కాలేజీల లెక్చరర్స్, యాజమాన్యాలు అందరూ హాజరై మాట్లాడారు. సినిమా థియేటర్లు, బార్లో లేని కరోనా స్కూల్లోనే ఉందా అని ప్రశ్నించారు. ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు, సిబ్బందికి కనీసం నెలకు రూ.10 వేలు చొప్పున 10 నెలల పాటు చెల్లించేలా ప్రభుత్వం కరోనా ప్యాకేజీ ఇవ్వాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, మండల కార్యదర్శి సైదులు, సీపీఎం పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు, సీపీఎం మండల కార్యదర్శి మందా సైదులు, యూటీఎఫ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, సీఐటీయూ నాయకులు పడకంటి మురళి, రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, శ్రీనిధి విద్యాసంస్థలు అధినేత అంజనా బాబు, ఠాగూర్ విద్యాసంస్థల అధినేత మధు, అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా, దారా బాలా రాజు, మార్నీ డు పుల్లారావు, టిడిపి మండల కార్యదర్శి మల్లాది, హనుమంతరావు, వెంకట్, విశ్వేశ్వరరెడ్డి, కోటేశ్వరరావు, గోపి, సాయి అనిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.