Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాసంస్థలను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శనివారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం కొప్పుల కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా భూక్యా వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని, ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సాగర్ జలాలు మే చివరి వరకు అందించి పంటలను రక్షించాలని కోరారు. విద్యారంగ పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) చేపట్టే ఉద్యమాల్లో అందరూ భాగస్వాములు కావాలని, పోరాటాలను బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ, మండల నాయకులు అన్నవరపు వెంకటేశ్వర్లు, మోతుకూరి వెంకటేశ్వరరావు, ప్రతాపనేని లక్ష్మయ్య, చింతపల్లి ప్రసాద్, బోయినపల్లి శ్రీనివాస్ రావు, బుర్రి గోపయ్య, ఇల్లందుల వెంకటి, వెంకటయ్య, పగిడిపల్లి కాటయ్య, రామలక్ష్మణులు, మురళి తదితరులు పాల్గొన్నారు.