Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
చావా శంకరయ్య ఆశయ సాధన కోసం ఉద్యమించాలని సిపిఐ(ఎం) మండల నాయకులు టిఎస్ కళ్యాణ్ అన్నారు. మండల పరిధిలోని పమ్మి గ్రామంలో చావా శంకరయ్య 28 వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ ఆధ్వర్యంలో శంకరయ్య వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ శంకరయ్య గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయం, ఆదర్శం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామంలో పార్టీ పురోభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో శంకరయ్య ఎంతో ఓర్పుగా వ్యవహరించి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ప్రజాక్షేత్రంలో పని చేశారన్నారు. శంకరయ్య పార్టీ కోసం చేసిన త్యాగం వృథా కాదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే శంకరయ్యకు నిజమైన నివాళులుని టీఎస్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతరం శంకరయ్య స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత పార్టీ గ్రామశాఖ కార్యదర్శి రాదారపు బాబు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండమీద సువార్త, మాజీ సర్పంచ్ కొండమీది అబ్రహం, సిపిఐ(ఎం) నాయకులు రాయబారపు రామయ్య, కొండమీది రఘుపతి, కొండమీది ఏసు, చావా శ్రీనివాసరావు, నకిరికంటి నరసింహారావు, శంకరయ్య సతీమణి మాజీ ఎంపిటిసి చావా భారతమ్మ, శంకరయ్య కుమారులు చావా అమరయ్య, చావా నాగార్జున తదితరులు పాల్గొన్నారు.