Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మధిర
రాష్ట్ర సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం స్వాహా చేయడం వల్ల ప్రజలపై భారం పడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మధిరలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదన్నారు జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 5 వేల కోట్ల రూపాయల మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టారన్నారు 2017 నుండి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు విడుదల కావడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం అప్పులు తేవటం వల్లే సామాన్య మధ్యతరగతి ప్రజలపై పడిందన్నారు. ప్రభుత్వం తెచ్చిన అప్పులు వలనే పెట్రోల్, డీజిల్, మద్యం ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడింది అన్నారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై యువత పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.