Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలో నూతన బస్టాండ్ ప్రారంభం నేపథ్యంలో పాతబస్టాండ్ మూసివేసిన దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యార్థం లోకల్బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ, ఖమ్మం రీజీయన్ మేనేజర్ సాల్మన్‌రాజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కాల్వొడ్డు నుంచి బైపాస్ రోడ్డులోని నూతన బస్టాండ్ వరకు ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకైనా ఒకటే చార్జి రూ.10 చొప్పున వసూలు చేస్తారు. ఖమ్మం కాల్వొడ్డు నుంచి నూతన బస్టాండ్ వరకు వయా పాతబస్టాండ్ మీదుగా పాత చేపల మార్కెట్, జడ్పీ సెంటర్, ఐటీ హబ్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీ, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీవో ఆఫీస్ రోడ్డు, నూతన బస్‌స్టేషన్ వరకు రూట్ ఏర్పాటు చేశారు. కాల్వొడ్డు నుంచి నూతన బస్టేషన్ వరకు ప్రతి పది నిమిషాలకు ఓ బస్సు చొప్పున, అటు నూతన బస్టేషన్ నుంచి కాల్వొడ్డు వరకు ఇదే మార్గంలోనూ పది నిమిషాలకు ఓ బస్సుచొప్పున నడుపుతారు. కాల్వొడ్డు నుంచి ఉదయం 6 గంటలకు మొదటి బస్సు, రాత్రి 9.50 గంటలకు చివరి బస్సు, నూతన బస్‌స్టేషన్ నుంచి కాల్వొడ్డుకు మొదటి బస్సు ఉదయం 6.30 గంటలకు చివరి బస్సు రాత్రి 10.20 గంటలకు నడుపుతున్నట్లు ఆర్ఎం వివరించారు.