Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గత నాలుగు రోజులు గా ఉష్టోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో అడువులు పలు చోట్ల ఎరగడి పడుతున్నాయి. దుమ్ముగూడెం అటవీ రేంజి పరిదిలో ని పర్ణశాల సెక్షన్లో గల పెద్దబండిరేవు, ములకనాపల్లి, పులిగుండాల అటవీ ప్రాంతాలలో పలు చోట్ల చెట్ల నుండి రాలిన ఆకులకు మంటలు అంటుకుని పెద్ద మంటలతో అడవులలో మంటలు చెలరేగుతూ పొగలు కమ్ముతున్నాయి. అటవీ సిబ్బంది ఎండాకాలంలో అడవులను సంరక్షించేందుకు ఫైర్ లైన్స్ ఏర్పాటు చేసినపప్పటికి గుట్ట దట్టంగా ఉన్న అటవీ ప్రదేశంలో అడవులకు నిప్పంటుకుని మంటలు చెలరేగుతున్నాయనే చెప్పవచ్చు. ఈ విషయమై పర్ణశాల ఫారెస్టు బీట్ ఆఫీసరు శ్రీను ను నవతెలంగాణ వివరణ కోరగా ఎండాకాలంలో అడవులను మంటలనుండి రక్షించేందుకు ముందస్తుగా ఫైర్ లైన్లు ఏర్పాటు చేశామని గుట్ట వంటి అటవీ ప్రాంతంలో నే అక్కడక్కడా అడవి ఎరగడి పడుతుందన్నారు. దీని వలన అటవీ మొక్కలకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన తెలిపారు.