Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్ఏ వనమా
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్రావు ఆదేశాలతో ప్రతి మున్సి పాలిటీ పరిధిలోని సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక రైతు బజార్, ప్రభుత్వ ఆసుపత్రుల మధ్యలో గల స్థలాన్ని అడిషనల్ కలెక్టర్ అనుదీప్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయల, మాంసం, చేపలు విక్రయ కేంద్రాలను ఒకేచోట ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. స్ట్రీట్ వండర్ వద్దకు అన్ని కూరగాయలు దుకాణాలను తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్ర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డి ఈ మురళి, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, ఆత్మకమిటీ డైరక్టర్ కాల్వ ప్రకాశరావు, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణరావు, టీ.ఆర్.ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరావు, మహీపతి రామలింగం, ఎర్రంశెట్టి ముత్తయ్య, ఎస్ వి ఆర్ కె ఆచార్యులు, కాల్వ భాస్కర్, దాసరి నాగేశ్వరరావు, చింత నాగరాజు, వై.రామ్మూర్తి నాయుడు, బేతనంశెట్టి విజరు, హర్షవర్థన్, బుద్ధి కిషోర్, భాస్కర్‌రావు, ఎలకా రామస్వామి, మున్సిపల్ ఏఈ రాజేష్, శానిటరి ఇన్స్పెక్టర్ వాణి, మండల ఆర్ఐ రామయ్య, సర్వేయర్ నాగరాజు పాల్గొన్నారు.