Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్ టవర్ ఎక్కిన యువకుడు
- పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం
- తహశీల్దార్ హామీతో దిగిన యువకుడు
నవతెలంగాణ-ములకలపల్లి
ములకలపల్లి ఎస్సై న్యాయం చేయలేదని మనస్తా పానికి గురైన యువకుడు శనివారం ములకలపల్లిలోని ఎయిర్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయతించాడు. పెద్దఎత్తున గుమిగూడి జనం ఏమి జరుగుతుందో అర్థం కాక సుమారు రెండు గంటలు హైరానా పడ్డారు. స్థానిక ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడితో మాట్లాడి క్రిందకు దిగాలని ఆదేశించినా యువకుడు ససేమిరా అనడంతో ఆందోళన నెలకొంది. తనకు ఎస్సై మాటలమీద నమ్మకం పోయిందని బాధితుడు చెప్పడంతో స్థానిక తహశీల్దార్ వీరభద్రం ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తాను పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడంతో బాధితుడు సెల్ టవర్ దిగి వచ్చాడు.
-అసలేం జరిగిందంటే
పొగళ్లపల్లి గ్రామానికి చెందిన కంబాకుల నాగేంద్ర బాబు(నాగరాజు) అనే యువకుడు సుమారు ఆరునెలల క్రితం పెనుబల్లి మండలం లింగగూడెంనకు చెందిన కృష్ణార్జునరావు దగ్గర డోజర్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కొంత మొత్తం డబ్బులు చెల్లించి డోజర్ తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మిగిలిన డబ్బుకు వడ్డీ చెల్లిస్తూ పని చేసుకుంటున్నాడు. హఠాత్తుగా కృష్ణార్జునరావు ఫైనాన్స్ వాళ్ళను తీసుకువచ్చి ట్రాక్టర్ను తీసుకెళ్లే క్రమంలో స్థానికంగా ఉన్న పెద్ద మనుషుల ద్వారా పోలీసులను ఆశ్రయించి తన దగ్గర తీసుకున్న డబ్బు చెల్లించే వరకు స్టేషన్ లొనే ఉంచాలని ఇంటికి వచ్చాడు. ఈ క్రమం లో స్థానిక పోలీసులు బాధితుడుకి సమాచారం ఇవ్వకుండా డోజర్ ను వదిలేశారు. ఆ నాటి నుంచి బాధితుడు నాగేంద్రబాబు స్టేషన్ చుట్టూ తిరిగి నా ఫలితం లేకపోయింది. మనస్థాపానికి గురై తన మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలిపాడు.
- పురుగుల మందు సేవించిన బాధితుడు
తహశీల్దార్ హామీతో సెల్ టవర్ దిగిన బాధితుడి దగ్గర పురుగు మందు డబ్బాను గమనించిన స్థానికులు మందు తాగినట్లు నిర్ధారించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక వైద్యం అందించి వైద్య సిబ్బంది సూచనల మేరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందజేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
-ఎస్సై అరచకానికి పరాకాష్ట ఈ ఘటన
స్థానిక ఎస్సై అరచకానికి నాగేంద్ర బాబు ఆత్మహత్య యత్నం పరాకాష్ట గా నిలుస్తుందని తహశీల్దార్ (సురేష్)-ఎస్సై బాధితుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు కారం వేంకటేష్, పోటా రాములు, ఊకే రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సై అవినీతి, అక్రమాలపై గత కొంత కాలంగా తాము బాధితుల తరుపున పోరాడుతు న్నామని గుర్తుచేశారు. తాము బాధితుల నుంచి సేకరించిన ప్రతి అంశంపై ఉన్నతాధికారులు విచారం జరిపి లంచగొండి అధికారులపై చర్య తీసుకోవాలని, బాధితుడు నాగరాజును వేధింపులకు గురిచేసి, మానసికంగా ఇబ్బంది పెట్టున ఎస్సై పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.