Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాచలం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీరామనవవమి బ్రహ్మౌత్సవాల్లో భాగంగా 21న స్వామి వారి తిరు కళ్యాణ మహౌత్సవం, 22న స్వామివారి మహాపట్టాభిషేకాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అంతరంగికంగా దేవస్థానం చిత్రకూట మండపంలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భక్తులకు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున, వారి సౌకర్యార్థమై పరోక్షంగా భక్తుల గోత్ర నామాలతో కళ్యాణం జరిపించేందుకు రూ.5 వేలు, రూ.1,116 టిక్కెట్లను ఆన్లైన్లో 'భద్రాచలం ఆన్లైన్. కామ్' వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని, కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. రూ.5వేల రుసుము చెల్లించిన భక్తులకు స్వామివారి ప్రసాదం. కళ్యాణ తలంబ్రాలు, వస్త్రములు, సచిత్ర రామాయణ పుస్తకం అందించడం జరుగుతుందన్నారు. అలాగే రూ.1,116 లను చెల్లించిన భక్తులకు ప్రసాదం. కళ్యాణ తలంబ్రాలను పోస్టల్ లేదా కొరియర్ ద్వారా పంపిస్తామని ఈవో వెల్లడించారు. ఆసక్తి గల భక్తులు పరోక్షంగానైనా వారి గోత్రనామాలతో పూజ జరిపించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలిపారు.
వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం
పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం శనివారం కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం ఆరాధన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు రామాలయంలోని బేడా మండపంలో స్వామివారికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.