Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
సోషల్ మీడియాలో వచ్చిన వందతులను నిర్ధారణ చేసుకోకుండా మరికొంత మందికి పంపించే పనులను చేయవద్దని కారేపల్లి ఎస్సై పీ,సురేష్ అన్నారు. శనివారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాకు విపరీతమైన క్రేజ్ ఉందని దీంతో మారుమూలన జరిగిన ఏ విషయమైన క్షణాల్లో తెలుస్తుందన్నారు. సోషల్ మీడియాతో ఎంతో మంచో అంత చెడూ ఉందన్నారు. వదంతులను వ్యాపింప చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించటం జరుగుతుందన్నారు. వాట్సప్ గ్రూపులలో చర్చల సందర్భంగా వ్యక్తిగత దూషణలు, కుల, మత పరమైన వ్యాఖ్యలను చేయవద్దని సూచించారు. పేస్బుక్ పరిచయాలతో మోసపోవటం, చోరీ వాహనాలను ఓఎల్ఎక్స్లో కొనుగోలు చేయటం,బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకోని వాటిని కాజేయటం వంటినేరపూరిత చర్యలు జరుగుతున్నాయని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.