Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గంట సాయి ప్రియ చదువుల్లో సరస్వతి పేదింటి విద్యార్థిని ఆమె జర్మనీలో ఎమ్మెస్సీ చదువుకోవటానికి ప్రభుత్వం 20 లక్షల సాయం చేయడంతో ఉన్నత చదువులకు జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పిఆర్టియు ఆధ్వర్యంలో శనివారం వెంకటాపురం గ్రామంలో ఆమె ఇంటి వద్ద సాయి ప్రియను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షుడు డి వినోద్, మండల నాయకులు ఎల్ సాంబశివరావు, సాయి ప్రియ తల్లిదండ్రులు గంట వెంకటేశ్వర్లు, పద్మ, అన్నయ్య గంట నరేష్ లు పాల్గొన్నారు.