Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ డిమాండ్
- డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బోడ సునీల్ మృతికి నివాళి
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బోడ సునీల్‌ది ప్రభుత్వ హత్యేనని, కేసీఆర్ వెంటనే నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి, చింతల రమేష్, ప్రభుత్వని డిమాండ్ చేశాడు. బోడ సునీల్ మృత్తికి సంతాపం తెలుపుతూ, ఉద్యోగాల నోటిఫికేషన్ని వెంటనే ఇవ్వాలని స్థానిక చిమ్మపుడి గ్రామ సెంటర్లో డీవైఎఫ్ఫ్ఐ, యస్యఫ్ఐ ఆధ్వర్యంలో కొవ్వొతులతో విద్యార్థులు, యువకులు ఘన నివాళి అర్పించి, నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డీవైయఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి, చింతల రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతుందని, అన్నారు. ఉన్నత చదువులు చదువుకొని రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాలు లేక తీవ్ర మనోవేదనతో, నిరుత్సాహంతో ఉన్నారని ఆయన అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ స్పందించి ఖాళీగా ఉన్న సుమారు 3 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకపోతే భవిష్యత్ లో కేసీఆర్ పై నిరుద్యోగులు యుద్ధం ప్రకటించడానికి విద్యార్థులు, యువకులు ఐక్యం అవుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్షుడు దశరద, వీరబాబు, ఎస్ఎఫ్ఐ గ్రామ కార్యదర్శి, దొంతు గణేష్, డీవైయఫ్ఐ గ్రామ సహాయ కార్యదర్శి జోనేబోయిన నవీన్, గ్రామ నాయకులు, దశరద, సురేష్, కడియాల పవన్, లోహిత్ రెడ్డి, పోతురాజు వేణుకుమార్, నాయకులు, దేశబోయిన పవన్, గాడిచర్ల విజరు, పరిమిశెట్టి. అజరు, కుదురుపాటి సాయి కృష్ణ, మర్రి. సాయి, దశరద. నవీన్ తదితరులు పాల్గొన్నారు.