Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఈత సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెల్దారుపల్లి నుండి దానవాయిగూడెం వరకు భారీ ఈత ర్యాలీ నిర్వహించారు. 12 కిలోమీటర్లు దూరం జరిగిన ఈత ర్యాలీని మహిళా పోలీస్ సీఐ సర్వయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఈత ర్యాలీ లో 3సంవత్సరాల చిన్నారుల నుండి 70సంవత్సరాల వయసు గల వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వయ్య మాట్లాడుతూ ప్రతి రోజు ఈత కొట్టడం వల్ల మంచి శరీర సౌష్టవంతో పాటు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా యువత ను ఈత వైపు మళ్లించేందుకు ప్రతి సంవత్సరం ఈత ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఆదివారం తెల్దారుపల్లి నుండి ప్రారంభమై గొల్లగూడెం, ముత్తగూడెం, పల్లెగూడెం మీదుగా దానవాయిగూడెం వరకు 12కిలోమీటర్లు ఈత కొడుతూ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఈత సంఘ అధ్యక్షులు చాగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాలని, ఈత రానివారికి అసోసియేషన్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. 200 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎవరైనా ఔత్సహికులు ఈత నేర్చుకోవాలనుకుంటే 9866449350, 9963149980 సంప్రదించలన్నారు. ఈ ఈత కార్యక్రమంలో లెఫ్ట్ కానల్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చాగంటి వెంకటేశ్వరావు, సంఘం సభ్యులు గోపాలపురం వెంకటాచారి, బండి వెంకటేశ్వరావు, మండేపూడి వెంకటేశ్వరావు, అనుమోలు రామిరెడ్డి, కొమ్ము విజరు చందర్, బోజెడ్ల ప్రభాకర్ రావు, టేకుమట్ల హుస్సేన్, ప్రింట్ ప్రసాద్, నరసింహారావు, సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు.