Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగి చెందారని కాబోయే ముఖ్యమంత్రి షర్మిలా అని రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న షర్మిల పార్టీ రాష్ట్ర పరిశీలకులు కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండల పరిధిలో జమలాపురం గ్రామం లోని బాలాజీ ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం వేమిరెడ్డి మల్లారెడ్డి, గూడూరు రమణారెడ్డి, అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రాకతో కారు ఖాళీ అవుతుందని గతంలో నవతెలంగాణ పేపర్లో ముందుగా ప్రకటించిన శీర్షిక ప్రకారం ఆదివారం జరిగిన ఈ సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలే నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందని మండల పార్టీ నాయకులు చేసే అక్రమాలకు ప్రజలు విసిగి వేసారి షర్మిల పార్టీలోకి చేరుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న పాలనను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఈనెల 9వ తారీఖున ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పార్టీ పరిశీలకులు నాగిరెడ్డి, బండారు రాజు, మధిర నియోజకవర్గ పరిశీలకులు రవీందర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు ,వెంకట్ రెడ్డి, చెన్నారెడ్డి, మల్లారెడ్డి, ఉమా మహేశ్వర రెడ్డి, లాల్ జాన్ బాషా, రత్నాకర్, దేవరకొండ భూషణం తదితరులు పాల్గొన్నారు.
ముందే చెప్పిన నవతెలంగాణ
వైయస్సార్ షర్మిల పార్టీ ఎర్రుపాలెం మండలంలో బలోపేతం కాబోతుందని టీఆర్ఎస్ పార్టీ నుండి భారీగా చేరికలు జరగనున్నట్లు ముందే నవతెలంగాణ చెప్పింది. అదే స్థాయిలో ఆదివారం జమలాపురం బాలాజీ భవన్ లో జరిగిన సన్నాహక సమావేశంలో భారీ ఎత్తులో వైయస్సార్ అభిమానులు, షర్మిలమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.