Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలేరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా..
- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-నేలకొండపల్లి
పాలేరు ప్రజలకు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని అందులో భాగంగా నేలకొండపల్లిలో 23 కిలోమీటర్ల మేర అన్ని గ్రామాలను అనుసంధానం చేసేలా రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 23 కోట్ల రూపాయలను మంజూరు చేయించినట్లు పాలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని బోదులబండ గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వారి ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర సురమాంబ దేవాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాలేరు ప్రజలు తనకు ఇచ్చిన అవకాశం మేరకు తాను ఇచ్చిన హామీలలో భాగంగా వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశానని అన్నారు. అందులో భాగంగా నేలకొండపల్లి మండల కేంద్రంలో పరిసర ప్రాంత గ్రామాలను అనుసంధానం చేసేలా 23 కిలోమీటర్ల మేర రూ.23 కోట్లతో నిర్మించబోయే రింగ్ రోడ్డుకు వేసవిలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ రింగురోడ్డు నిర్మాణం ద్వారా పరిసర ప్రాంత గ్రామాల రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉండటం చేత మాత్రమే అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు పూర్తి చేయించగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాధు రమేష్రెడ్డ్డిి, గ్రామ సర్పంచ్ అనగాని అనిత, పిఎసిఎస్ చైర్మన్ అనంతు కాశయ్య, మాజీ మండల అధ్యక్షుడు వెన్నపూసల సీతరాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, కడియాల శ్రీనివాసరావు, అనగాని నరసింహారావు, కట్టేకోల నాగేశ్వరరావు, గువ్వలగూడెం గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వంగూరి ఉష, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.