Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలు పంపిణీ చేసిన వైద్యులు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం పట్టణం బాలాజీనగర్‌లో జాగృత్ న్యూరో హాస్పిటల్‌ను పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య, అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహకులు అన్నం శ్రీనివాస్ రావుల చేతులమీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతితక్కువ ఖర్చుతో పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించి మంచి పేరు ప్రఖ్యాతాలు తెచ్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలన్నారు. మనవ సంబంధాలను మర్చిపోకుడదని తల్లిదండ్రులను గౌరవించి వారిపట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. పిల్లలకు ఆస్థి అంతస్తులు పంచి ఇవ్వకపోయిన ప్రధానంగా భావితరాలకు స్వచ్చమైన గాలిని అందించలాంటే మొక్కలు నాటించి పెంచివాటి సంరక్షణ బాధ్యత కూడా తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య, అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహకులు అన్నం శ్రీనివాస్ రావులను శాలువలతో వైద్యుల కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం హస్పిటల్ వైద్యులు డాక్టర్ రేపాక నిఖిల్ న్యూరో ఫిజిషియన్ (ఎండి,డియం), డాక్టర్ కె రాజశేఖర్ గౌడ్ జనరల్ ఫిజిషియన్ (యండి)లు ఎంపి జోగినపల్లి సంతోష్ కూమార్ గ్రీన్ ఛాలెంజ్ స్పూర్తితో ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతిఒక్కరికి మొక్కలు పంపిణీ చేశారు. సూమారు రెండు వేల మొక్కలను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఒకే తరహ వైద్యం అందిస్తాం. డబ్బు కన్న రోగిప్రాణం మిన్నగా భావిస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ సుజన, రాంప్రసాద్ గౌడ్, సునీల్ గౌడ్, హస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.