Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7న ఖమ్మంలో మహాధర్నా
- విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా
నవతెలంగాణ-ఖమ్మం
ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లూడుతూ ఇటీవల అన్ని రాజకీయ, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని అ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలి, ప్రైవేట్ విద్యసంస్థలలో పనిచేసిన అధ్యాపకులకు గత ఏడాది కరోనా నుంచి ఇప్పటి వరకు 10నెలల పాటు వేతనం ఒక్కోక నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, ఒక వేళ ఇంకా విద్యా సంస్థలు కొనసాగించకపోతే వారికి ప్రతి నెల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ఈనెల 7వ తేదిన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయాంచామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో పని చేసే అధ్యాపకులు పాల్గొన్నాలని పిలుపు నిచ్చారు. అంతేకాకుండా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యలు కూడా పాల్గొనాలని కోరారు. గత మార్చి నుంచి ఫిబ్రవరి వరకు విద్యా సంస్థలు మూసివేసిందని, తిరిగి 24వ తేదిన విద్యా సంస్థలు ప్రారంభించిందని, మరల మార్చి 24వ తేదీన విద్యాసంస్థలు మూసివేసిందని, విద్యా సంస్థలు మూసివేసే నాటికి పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు. కేవలం కొన్ని గురుకుల పాఠశాలలో అక్కడ అక్కడ కరోనా వ్యాపించినట్లు వార్తలు వచ్చాయని, ప్రభుత్వం ఇప్పటికి కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చేబుతావుందని, లాక్ డౌన్ విధించడం కుదరదని, ప్రజా జీవనం విధంచడం విలేకాదని, చేబుతుందని,అన్ని కొనసాగిస్తునే విద్యా సంస్థలు ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. అన్నితెరిచే ఉన్నాయని, సభలు, సమావేశాలు సినిమాలు ఇలా కొనసాగుతున్నాయని అదే విధంగా ఎంఎల్సీ ఎన్నికలు, ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని, అంతే కాకుండా నాగార్జు సాగర్ ఉప ఎన్నిక జరబోతుందని, వేల మందితో బహిరంగ సభలు పెట్టబోతున్నారని, ఈ అన్నింటికి లేని ఆటకం తరగతి గదిలో 20 మంది కూడ లేని పిల్లలు కుర్చొన్న వారికి వస్తూందా అని ప్రశ్నించారు. ఎంఎల్సీ ఎన్నికల కోసం ప్రైవేట్ విద్యా సంస్థలను మేనేజ్ చేసుకోడం కోసం, ఉపాధ్యాయులు అందరు ఓకే చోటుకి వస్తారు కాబట్టి ఎన్నికల ప్రచారం చేసుకోవడం కోసం, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు రాబట్టుకోవడం కోసంమే విద్యా సంస్థలు ప్రారంభించారని అన్నారు. అవి అయిపోయిన వెంటనే మళ్లీ విద్యా సంస్థలు మూసివేశారని ఆరోపించారు. విద్యాసంస్థలు మూసివేయడం వలన 3 లక్షల మంది అధ్యాపకులు రోడ్డన పడ్డరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మూసివేడం వలన పిల్లల మానసిక పరిస్థితి మారి పెడదోవ పట్టే అవకాశం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు శింగు నర్సింహరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఎం.డి జావిద్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు సి.వై పుల్లయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.