Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగర పాలక సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఖరారైంది. రూ.257.91 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్ ను ప్రత్యేకాధికారి కలెక్టర్ ఆమోదించారు. గత ఏడాది రూ.145.12కోట్లు ఉంటే ఈ ఏడాది అదనంగా రూ.112.79 కోట్లు పెరిగింది సొంత ఆదాయం రూ.67.09కోట్లు, గ్రాంట్ల ద్వారా 190.82 రూ కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. త్వరలో నగరపాలక సంస్థ ఎన్నికలు ఉండటంతో అదనపు పన్నుల భారం లేకుండా చేశారు. పట్టణ ప్రగతి ద్వారా రూ 92.48కోట్లు వస్తాయని అంచనా వేశారు. కరోనా, గ్రామీణ మండలం నుంచి విలీనమైన గ్రామాలను తొలగించిన నేపథ్యంలో సొంత ఆదాయం గత ఏడాది రూ.86 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.78 కోట్లకు కుదించారు. సొంత ఆదాయంలో ఒప్పంద ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంధన ఛార్జీలు, మురికివాడల అభివృద్ధి గ్రీన్ బడ్జెట్ కు కేటాయించారు. కీలకమైన అభివృద్ధి పనులను గ్రాంట్లపైనే ఆధారపడాల్సి ఉంది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించిన రూ.150 కోట్లను ఇందులోనే చూపారు. రూ.257.91కోట్లు కాగా, వ్యయం రూ.256.54కోట్లుగా చూపారు.