Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రార్ధనా మందిరాల్లో పునరుత్ధానం ప్రత్యేక ప్రార్థనలు
- యూట్యూబ్, వెబ్ యాప్ నుంచే సందేశాన్ని వీక్షించిన క్రైస్తవులు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఏసుక్రీస్తు చూపిన మార్గంలోనే సమస్త మానవాళి మనుగడకు సాధ్యపడుతుందని కొత్తగూడెం సీఎస్ఐ సెయింట్ ఆండ్రూస్ చర్చ్ పాస్టర్ చైర్మెన్ జాన్సన్ జేసుదాసు భక్తులకు సూచించారు. ఆదివారం తెల్లవారు జామున కొత్తగూడెం సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ పర్వదినం ప్రాంతంలో భక్తులకు దైవ సందేశాన్ని వినిపించారు. సిలువ వేయబడిన యేసు మూడవ దినమున తిరిగి లేచి ఈ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా పునరుత్థాన దినం (ఈస్టర్)గా జరుపుకుంటామని తెలిపారు. ప్యూన్ బస్తీలోని బేతేస్తా ప్రార్థన మందిరంలో పాస్టర్ క్లైమేట్ ఈస్టర్ ప్రత్యేక ఆరాధనలను నిర్వహించి వాక్యాన్ని బోధించారు. ఆర్సీఎం చర్చి బేతనియ బెరాకా సీయోను మన్న చర్చ్ సెయింట్ ఆండ్రూస్, సెయింట్ థామస్ ప్రత్యేక క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహారం కమిటీ సభ్యులు ఆరాధన నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి కొంత మంది ఈస్టర్ సందేశాన్ని యూట్యూబ్, వెబ్ యాప్ నుంచి వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు శాంసన్, డేవిడ్ రాజ్, ప్రమోద్ కుమార్, విజయ శరత్, సందీప్, విక్టర్ రవి పాల్, శ్యామ్, ఫ్రాంక్లిన్, క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : పట్టణంలో అదివారం ఈస్టర్ పండుగ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చర్చిలను గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. మందిరాలలో సువార్తీకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
భద్రాచలంలోని ఏయస్ ఆర్ కాలనీలోని విమోచన ప్రేయర్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. చర్చి ఫాస్టర్ రెవరెండ్ ప్రకాశ రావు ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం యేసు శిలువయాగం విషాదంతో సమాప్తమైందని అన్నారు. ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్తోనంతో లోకంలో క్షమా యుగపు శుభారంభం జరిగిందన్నారు. అదేవిధంగా ఆయా చర్చిలలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు పాల్గొన్నారు.
తల్లాడ : మేకల ప్రసాద్ పాస్టర్ ఆధ్వర్యంలో బండారు గూడెం గ్రామంలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఎర్రుపాలెం : మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామంలో ఆర్సీఎం చర్చి నందు శనివారం అర్ధరాత్రి నుండి భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండగను విచారణ గురువులు ఫాదర్ అంథోని, ఫాదర్ రాయప్ప ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం నాటి యేసు సిలువ యోగం సమాప్తమైనది. ఆదివారం తెల్లవారుజామున యేసు పునరుద్ధానంతో లోకములో క్షమ యుగపు శుభారంభం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.