Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైరానా పడ్డ మిర్చి కల్లాల రైతులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలో ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా గాలి వాన పడింది. అధికంగా వీచిన గాలులకు భద్రాచలం, చర్ల ప్రధాన రహదారి చిన్నబండిరేవు వద్ద రహదారికి అడ్డంగా భారీ చింత వృక్షం కూలింది. దీంతో రాక పోకలు నిలిచి, వాహన దారులు నానా ఇబ్బం దులు పడ్డారు. ఒక్క సారిగా ఆకాశం మేఘామృతంగా మారి గాలి వాన వస్తుండడంతో మిర్చి కల్లాల రైతులు కల్లాల వద్దకు పరుగులు తీశారు. ఆర బోసిన మిర్చిని తడవకుండా కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో రేకుల షెడ్లు, పూరి పాకలు గాలులకు పైకి లేచి పోయాయి. ఏది ఎమైనా ఒక్క సారిగా వచ్చిన అధిక గాలులు, వర్షానికి జన జీవనం అతలాకుతలం అయిందనే చెప్పవచ్చు.