Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆర్ధిక సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకం కావాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పెఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రావణ్ పిలుపు నిచ్చారు. దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పిఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ మహాసభ సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో కుల వైషమ్యాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వతంత్య్ర భారతంలోనూ కుల, మత వైశమ్యాలు హెచ్చుమీరుతున్నాయని, నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరజీవి డాక్టర్ బిఆర్ అంబేద్యర్ దళితులకు కల్పించిన రాజ్యాంగ హక్కులు అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయన్నారు.
అభివృద్ధి కాగితలకే పరిమితం : సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాభీర్ పాషా
ఏడు దశాబ్ధాల స్వతంత్ర పాలనలో నేటికీ దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, సమానత్వం, సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన, ఆర్థికాభివృద్ధి కాగితలకే పరిమితమైం దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా భూమి లేని ప్రతి నిరుపైద కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. ఈ మహాసభలో డీహెచ్పిఎస్ జిల్లా నాయకులు బందెల నర్సయ్య, సలిగంటి శ్రీనివాస్, పండా ఆనంద్, పేరాల శ్రీనివాస్, పండా ఆనంద్, మారపాక రమేష్ కె.రత్నకుమారి, కుమ్మరి రవీందర్, కొచ్చెర్ల జోసఫ్, మంద నిర్మళ, ధనలక్ష్మి, పండూరి వీరబాబు, నక్క నాగమణి తదితరులు పాల్గొన్నారు.