Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీ చౌక్
ఖమ్మంలోని తాపీ మేస్త్రీలు వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని పెద్దఎత్తున ధర్నాకు దిగారు. ఖమ్మం గాంధీ చౌక్ లో తాపీ మేస్త్రి లో ధర్నాకి దిగారు. తాపీ మేస్త్రి కూలీల కూలి రేట్లను, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సి ఉండగా వారి కూలీ రేట్లు వారికి అనుకూలంగా పెంచలేదని ధర్నా నిర్వహించారు.గతంలో తాపీ మేస్త్రీకి రూ.700, కూలి మగవారికి 500, ఆడవారికి 450 రూపాయలు ఇస్తుండగా, ఆ కూలీ రేట్లను సుతారికి రూ.900, కూలీకి రూ.600 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. కరోనా కారణంగా నాలుగు నెలలు పనిలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనం, ప్రస్తుతం నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు పెరిగినందున తమకు కూలీ పెంచడం వల్ల ఆర్థికంగా మాకు సపోర్ట్ దొరుకుతుందని, కూలీలు తమ ఆవేదనను వెల్లడించారు. అయితే మేస్త్రిలు, బిల్డర్లు కుమ్మక్కై వాళ్లకి అనుకూలంగా రేట్లు పెంచారని తెలిపారు.