Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం : అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడటమే కాకుండా రాజ్యాంగం కల్పించిన ఫలాలను క్రిందివరకు అమలుచేయించిన గొప్ప పార్లమెంటరీయన్ బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన స్ఫూర్తితో నేడు రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రమణ గుట్ట ప్రాంతంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నగర కమిటీ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ 114 వ జయంతి కార్యక్రమం జరిగింది. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో దళితులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం, రిజర్వేషన్లపై చేస్తున్న దాడిని ప్రతి ఒక్కరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీస్ నగర నాయకులు నకిరకంటి చిరంజీవి, తగరం లక్ష్మయ్య, తడికమల్ల రవి, తడికమల్ల వెంకటేశ్వర్లు, కృష్ణ, వెంకటేష్, బట్టు గురవయ్య, బంధు శేఖర్, ప్రశాంత్, కరుణాకర్, బత్తుల శ్రీను పాల్గొన్నారు.
వేంసూరు : స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎంపీపీ పగుళ్ల వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటాపురంలో సర్పంచ్ పాలా వెంకట రెడ్డి ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
ఖమ్మం లీగల్ : ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డా//బాబూ జగ్జీవన్ రామ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప రాజకీయ వెత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, కార్యవర్గం కూనా చంద్రశేఖర్, గురుమూర్తి, ఇమ్మడి లక్ష్మీనారాయణ, రవి ప్రసాద్, కృష్ణా రావు, తాజుద్దీన్ బాబా, బిచ్చాల తిరుమల రావు, మందడపు శ్రీనివాసరావు, పీపీలు పసుపు లేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొత్తగూడెం లీగల్ : కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ నీరు కొండ వెంకట రాజేష్, జాయింట్ సెక్రెటరీ కాసాని రమేష్, లైబ్రరీ సెక్రెటరీ ఆరకాల కరుణాకర్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రెటరీ సాహూ సంతోష్, మహిళా రిప్రజెంటేటివ్ నల్లమల ప్రతిభ, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.