Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన సూత్రధారి మడవి హిడ్మా
- మూడు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు
- రామన్న స్థానమును భర్తీ చేసిన హిడ్మా - ఎన్కౌంటర్లో దిట్ట
- రూ.40 లక్షలు రివార్డు గల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా
''ఒక్కసారిగా దేశమంతటా ప్రకంపనలు సృష్టించిన సరిహద్దు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్ ప్రధాన సూత్రధారి మడవి హిడ్మా అలియాస్ సంతోష్ ఇతని పేరు వింటేనే మూడు రాష్ట్రాలు గజగజ వణికి పోతున్నాయి. సుక్మా మాస్టర్ మైండ్‌గా పేరొందిన మడవి హిడ్మా బాల్యంలోనే మావోయిస్టు పార్టీలో చేరి పీపుల్స్ లిబరేషన్ గొర్లి ఆర్మీని నిర్మించడంలో ప్రధాన భూమికను పోషించాడని తెలుస్తోంది. సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో ఓ సామాన్య ఆదివాసీ కుటుంబంలో జన్మించిన మాడవి హిడ్మా నేడు జాతీయంగా, అంతర్జాతీయంగానూ మహారాష్ట్ర మోస్ట్ కిల్లర్ వీరప్పన్ స్థాయిలో తన పేరు మారుమోగుతోంది. ప్రధానంగా అతి చిన్న వయసులోనే ప్రాథమిక విద్యను ముగించుకొని మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచలుగా ఎదిగి మావోయిస్టు పార్టీలో ఎన్నో దుర్ఘటనలకు బీజం పోసిన హిడ్మా గురించి ప్రత్యేక కథనం''
నవతెలంగాణ- చర్ల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా తరెంలో సీఆర్పీఎఫ్పై భీకరదాడికి సూత్రధారి హిడ్మాగా అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) నంబర్ 1 బెటాలియన్‌కు కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జడ్సీ) సభ్యుడిగా ఉన్నాడు. రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో చాలావరకు ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మెరుపు వేగంతో దాడులు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందిన గిరిజనుడు హిడ్మా. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ)లో చేరాడు. ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే పూర్తి చేసిన అతడు.. మావోయిస్టు ఆపరేషన్లలో దిట్టగా పేరొందాడు. యుద్ధ నైపుణ్య మెలకువలను కేడర్‌కు అలవోకగా నూరిపోస్తుంటాడనే పేరుంది. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎటఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది. తలపై రూ.40 లక్షల రివార్డు దేశీయ ఆయుధాల్ని, ఐఈడీ బాంబుల్ని తయారు చేయడంలో పట్టు కలిగి ఉన్న హిడ్మాను ఒక దశలో పార్టీ కేంద్ర కమిటీలో తీసుకోవాలనే చర్చ జరిగింది. వయసు ఇంకా నాలుగు పదుల్లోనే ఉండటం, దాడుల్లో దూకుడుగా వ్యవహరిస్తుండటం వల్ల పార్టీ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని నిఘావర్గాలకు సమాచారం అందింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నట్లు తెలుస్తున్న హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు ఉంది. గతంలో భాజపా ఎమ్మెల్యే బీమా మడవి హత్య కేసులో ఎన్ఐఏ అతనిపై అభియోగ పత్రం నమోదు చేసింది. 180 నుండి 250 మంది పిఎల్జిఏ సైన్యాన్ని తయారుచ యడంలో నిమగమయ్యే అతను 2010 సంవత్సరంలో దంతేవాడ దండకారణ్యంలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతికి కారణం అయ్యాడు. 2012 సంవత్సరంలో సుక్మా కలెక్టర్ ఎల్ఎక్స్ పాలు మృతికి కారకుడయ్యాడు. 2013 సంవత్సరంలో 31 మంది కాంగ్రెస్ నాయకులను మట్టుబెట్టాడు. 2017 సంవత్స రంలో 37 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి ప్రధాన కారకుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాల్గొన్నా ఎన్నో స్టింగ్ ఆపరేషన్లు విజయం సాధించి నరహింస భక్షకుడుగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పోలీస్ అధికారులకు సవాళ్ళు విసురుతున్నాడు.
కాగా హిడ్మా నేతృత్వంలో వారం రోజుల నుండి రహస్య సమావేశాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలకు తప్పుడు సమాచారం వెళ్లేవిధంగా పక్కా ప్రణాళికతో పోలీసు బలగాలను దండకారణ్యానికి రప్పించి మట్టుపెట్టిన వ్యూహం హిడ్మాదని తెలుస్తుంది. శనివారం నాటి దాడిలో దాదాపు 250 మంది ఉన్న పీఎల్జీఏ బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహించాడని నిఘా వర్గాల వెల్లడించాయి.
రామన్న స్థానం భర్తీ చేసిన హిడ్మా
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మాస్టర్ మైండ్ రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న స్థానాన్ని మావోయిస్టు పార్టీలో, దండకారణ్యం మీద పట్టు ఉన్న మడివి హిడ్మా భర్తీ చేశాడని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. అంటే ఇంచుమించు ఇటు దక్షిణాది అటు ఉత్తరాది రాష్ట్రాల అధికారులను గడగడలా డించిన రామన్న స్థానాన్ని భర్తీ చేశాడు. అంటే హిడ్మా వ్యూహాలు ఎలాగ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 2018లో రామన్న అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తగ్గ క్యాడర్ దొరకడని అనుకున్న క్రమంలో రామన్న అంగరక్షకుడిగా సుమారు 20 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన హిడ్మా రామన్న స్థానాన్ని భర్తీ చేసి గురువు దగ్గర శిష్యుడిగా వ్యూహాలు ప్రతివ్యూహాలు అల్లుతూ కూంబింగ్‌కు వచ్చే పోలీసులే లక్ష్యంగా ఇప్పటికే పలుమార్లు దురాగతానికి పాల్పడ్డట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్లో దిట్టగా ఇతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గా గుర్తించబడ్డాడు.