Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎండీ ఎన్.శ్రీధర్‌కు టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు వినతి
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణీయుల పదవీ విరమణ వయసును తక్షణమే పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు యాజమా న్యాన్ని కోరారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సోమవారం టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు సీఎండీ ఎన్.శ్రీధర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులందరి పదవీ విరమణ వయసును 61 యేండ్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే సింగరేణిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పదవీ విరమణ వయసు పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను, జారీ చేయాల్సిన మార్గదర్శకాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలన్నారు.