Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోణి పెద్ద ఆర్లగూడెం గ్రామంలో తరతరాలుగా నిర్వహిస్తున్న కొర్సా వంశస్థుల ఇలవేల్పుల పండుగ (దండి మారేమ్మ) జాతరను సోమవారం ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా కొర్సా కుటుంబీకులు ఉన్న వివిధ గ్రామాలలో తిరిగి ఆర్లగూడెం మండతో చేరినా వేల్పులకు శుద్ధి చేసి కుల సంప్రదాయబద్ధంగా గంగా స్నానమాచరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ జాతరకు వివిధ కోయ గూడేల నుండి ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించారు. వచ్చిన భక్తులకు నాగులు శ్రీరాములు కోయపురాణం వివరించారు. ఈ కార్యక్రమంలో తలపతి కొర్సా సుబ్బారాజు, పూజరీ చలపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.