Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎన్డీలో గత 6 సంవత్సరాల నుంచి పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా, ఉంటూ కొత్తగూడెం, పాల్వంచ న్యూ డెమోక్రసీ పట్టణ కమిటీ సభ్యుడిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రామటెంకీ అశోక్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ఎన్డీ కొత్తగూడెం, పాల్వంచ పట్టణ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ ప్రకటించారు.
సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడారు. రామటెంకీ అశోక్, గత ఆరు సంవత్సరాల నుంచి, పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తున్న అతను గత 2 సంవత్సరాలుగా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన ఉషారాణితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని, దొంగ చాటుగా పెండ్లి చేసుకొని, ఒక బాబుకు జన్మనిచ్చాక ఇప్పడు తనకేమి సంబంధం లేదని చెపుతున్నాడని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అయన్ని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విలేకర్ల సమావేశంలో పట్టణ కమిటీ సభ్యురాలు జాడి మంజుల, రామటెంకీ అశోక్ బాధితురాలు ఉషారాణి, తల్లిదండ్రులు సమ్మయ్య, రత్నమ్మ, మమత, ప్రత్యూష, వెంకన్న, సురేష్, తదితరులు పాల్గొన్నారు.