Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ఆళ్లపాడులో అమ్మ ఫౌండేషన్, ఆళ్లపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా 8 మండలాల స్థాయి కబడ్డీ, క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆళ్లపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ తెలిపింది. బోనకల్, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, కొణిజర్ల, ముదిగొండ, ఆంధ్రప్రదేశ్లోనే వత్సవాయి మండలాల క్రికెట్, కబడ్డీ క్రీడాకారులు పాల్గొనాలని కందుల పాపారావు తెలిపాడు. క్రీడా పోటీలు ఉగాది పర్వదినం 13వ తారీఖున ప్రారంభమవుతాయని, 21వ తారీఖు శ్రీరామనవమి రోజున విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కబడ్డీ ప్రథమ బహుమతి రూ.10,016, ద్వితీయ బహుమతి రూ.5,016, క్రికెట్ మొదటి బహుమతి రూ.10,016, ద్వితీయ బహుమతి రూ.5,016 అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ కీపర్ బహుమతులు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఎంట్రీ ఫీజు 400 రూపాయలు అని తుది నిర్ణయం కమిటీ వారిదే అని ఆయన తెలిపారు. క్రీడా పోటీలను అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ప్రారంభిస్తారని తెలిపారు. విజేతలకు బహుమతులను ఎంఎల్ఏ భట్టి విక్రమార్క అందజేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం కందుల పాపారావు 9701264473, జాన్ బాషా 9908791712, మరీదు వీరబాబు 9010269508 లను సంప్రదించాలని ఆయన కోరారు.