Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
40 ఏండ్ల సుదీర్ఘ కాలం అనంతరం నేడు పగలు, ప్రతీకారాలకు పులిస్టాప్ పడింది. ఉప్పు, నిప్పులా పగలు ప్రతీకారాలతో, నువ్వా నేనా అనే విధంగా కత్తులు దూసుకొన్న కాంగ్రెస్, సీపీఐ ఎట్టకేలకు చేతులు కలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి మండల పరిధిలోని కలకోట హరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉంది. జిల్లాలోనే ప్రత్యేకంగా దళితులకు కలకోట పెద్ద చెరువు రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది. 1980 నుంచి గత ఎన్నికల వరకు సీపీఐ, కాంగ్రెస్ నువ్వా నేనా అనే విధంగా కత్తులు దోచుకున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి తోటపల్లి జాషువా హోరాహోరీ పోటీలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కొద్దికాలం తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. జాషువాని ఎట్టిపరిస్థితులలోనూ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీలులేకుండా మిగిలిన ఎనిమిది మంది డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో పాలకవర్గాన్ని మత్స్యశాఖ అధికారులు రద్దు చేశారు. దీని ఫలితంగా ఎన్నికల్లో నిర్వహించవలసి వచ్చింది. ఈ ఎన్నిక ఎప్పుడు జరిగిన హౌరాహౌరీగా నే కాంగ్రెస్, సిపిఐల మధ్య జరిగేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్, సీపీఐలకు తోడుగా టీఆర్ఎస్ కొత్తగా వచ్చింది. ఇటీవల జరిగిన పరిణామ క్రమంలో సీపీఐకి చెందిన కొంతమంది సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉంది. తొలుత కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే టీఆర్ఎస్ కి ఒక్క డైరెక్టర్ స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో టీఆర్ఎస్ కూడా సొసైటీ ఎన్నిక ఏకగ్రీవానికి కాంగ్రెస్, సీపీఐ నాయకులతో చర్చలు జరిపిన దీంతో సొసైటీ ఎన్నిక ఏకగ్రీవానికి నాంది పడింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగే ఎన్నిక ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరగటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడిగా సీపీఐకి చెందిన బలుగుల అచ్చయ్య, కార్యదర్శిగా కాంగ్రెస్కు చెందిన జంగం ప్రసాదరావు, ఉపాధ్యక్షుడిగా టీఆర్ఎస్కు చెందిన తోటపల్లి జాషువా ఎన్నికయ్యారు. సంఘం ఆర్థిక కార్యకలాపాలు అన్నీ కూడా అధ్యక్షుడు, కార్యదర్శి పేరు మీదనే కొనసాగుతాయి. డైరెక్టర్గా సిపిఐ నుంచి యంగల సుందర రావు, కాంగ్రెస్ నుంచి బండి ప్రభాకర్ రావు, యంగల రవికుమార్, మాతంగి దావీదు, టీఆర్ఎస్ నుంచి యంగల యున, అబ్బూరి బాబు ఎన్నికయ్యారు.