Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సస్పెన్షన్ బ్రిడ్జి రూపకర్త గిరీష్ భరద్వాజ్ కు పద్మశ్రీ అవార్డు రావడంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ది బ్రిడ్జి మన్ ఆఫ్ ఇండియాగా గిరీష్ ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఎన్నో గ్రామాలకు అనుసంధానం లేక సరైన వైద్యం, విద్యకు దూరం అవుతున్న తరుణంలో గిరీష్ భరద్వాజ్ అతి తక్కువ ఖర్చుతో వేలాడే తీగల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ను రూపొందించారని తెలిపారు. తద్వారా అనేక గ్రామాలకు మార్గాలు ఏర్పడి ప్రజల జీవన విధానం మెరుగుపడిందని గుర్తు చేశారు. ఆయన నిర్మించిన వంతెనల వల్ల వేల గ్రామాలు అభివద్ధి చెందడంతో పాటు లక్షల మందికి ఉపయోగం జరిగిందన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన గిరీష్ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 147 బ్రిడ్జి లను నిర్మించారని తెలిపారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ లో సైతం గిరీష్ భరద్వాజ్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. అతి త్వరలో ఆ అద్భుత నిర్మాణం అవిష్కతం కానుండటంపై మంత్రి హర్షం వెలిబుచ్చారు.