Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ముదిగొండకు రానున్నట్లు పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ సోమవారం తెలిపారు. వెంకటాపురం గ్రామానికి చెందిన సిపిఐ(ఎం) మాజీ నాయకులు రాయల వెంకటేశ్వర్లుతో పాటు మరి కొంతమంది తమ్మినేని సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటాపురం గ్రామం నుండి ముదిగొండ మచ్చా వీరయ్య భవనం వరకు పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాసిరెడ్డి వెల్లడించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పార్టీ జిల్లా నాయకులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి మండలంలోనే పార్టీ నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరు కావాలన్నారు.
రాయల సిపిఐ(ఎం)ని వీడి దశాబ్దం దాటింది. దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీలో రాయల కార్యకలాపాలను నిర్వహించి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటూ గత రెండు సంవత్సరాల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల జరిగిన నేపథ్యంలో సిపిఐ(ఎం) రాజకీయాలకు దగ్గరగా ఉంటూ రాయల పార్టీ నాయకులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో రాయల చిన్న కుమారుడు రాయల శ్రీనివాసరావు సొసైటీ ఎన్నికల కంటే ముందు సిపిఐ(ఎం)లో చేరి పార్టీ తరపున సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసి సొసైటీ డైరెక్టర్గా గెలుపొంది పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఉద్యమాలకు పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచింది ముదిగొండ చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఎర్రజెండా నీడన ఎంతో మంది పార్టీ కార్యకర్తలు రక్తతర్పణం చేసి సీపీఐ(ఎం)పార్టీకి ముదిగొండ పెట్టన కోటగా పార్టీకి తిరుగులేని గడ్డగా గ్రామగ్రామాన ఎర్రజెండా మరింతగా వన్నెతో రెపరెపలాడుతూ ప్రజలకు అండగా నిలిచింది. మండలంలో బలమైన పార్టీగా సిపిఐ(ఎం) ప్రజల పార్టీగా మండలంలో ప్రజా ఉద్యమాలకు నిలయంగా ముదిగొండ వేదికైంది. ఈనేపథ్యంలో రాయల వెంకటేశ్వర్లు సిపిఎంతో 30 సంవత్సరాల అనుబంధం ఉండి తిరిగి ఆ పార్టీలో చేరడం విశేషం.