Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
- హైదరాబాద్ ఉస్మానియా ప్రొఫెసర్లు
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బౌద్ధ స్థూపాన్ని సోమవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధ స్థూపం యొక్క విశేషాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం వంద సంవత్సరాలు పూర్తిచేసుకుని ఘన కీర్తిని కలిగిందన్నారు. తెలంగాణలోని ప్రాచీన చారిత్రక నిర్మాణాలు, విశేషాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన చారిత్రిక ప్రాంతాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. ఘన చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపాన్ని తెలంగాణలో టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. వేల సంవత్సరాల తెలంగాణ చరిత్రను ఉజ్వలంగా నిలబెట్టాలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హౌదా కల్పించిన ఘనత తెలంగాణలోని కోటిలింగాలలో నిర్మాణమైన బౌద్ధ స్తూపం చారిత్రక ఆధారంగా లభించిందన్నారు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల అని అక్కడ దొరికిన శాసనాల ఆధారంగానే నేడు తెలుగు భాష రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నిజం నిరూపితమైన తద్వారా ప్రాచీన హౌదా దక్కించుకుంది అన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్లు డాక్టర్ వంశీధర్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ విజరు, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ రాధాకష్ణ పాల్గొన్నారు.