Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిబిరాన్ని సందర్శించిన పోతినేని
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని ఖానాపురం హవేలిలో ఐదు రోజులుగా వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల శిబిరాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి వారికి శ్రమకు తగిన జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి కోరినట్లు జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా గ్రానైట్ యాజమాన్యాలు డ్రైవర్లని చర్చలకు పిలిచి వారి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల సమ్మె కొనసాగుతుందని తెలిపారు. గ్రానైట్ యాజమాన్యాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేస్తారని, దాని కాలం చెల్లి ఐదు నెలలు అయినప్పటికీ జీతాలు పెంచడం లేదని అన్నారు. సిపిఎం ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతి రావు మాట్లాడుతూ యాజమాన్యాలు తక్షణం దిగివచ్చి జీతాలు పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, కె.అమరావతి, మురహరి రమ్య, కె. నవీన్, డ్రైవర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు టి.లింగయ్య, రామదాసు, డి.సుధాకర్, ఎం.నరసయ్య, ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.