Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని చిన్నబండిరేవు గ్రామానికి చెందిన గోనే రంగారావు అనే (23) యువకుడు కిడ్నీ సంబందిత వ్యాధితో మృతి చెందిన హృదయ విధారక సంఘటన చిన్నబండిరేవు గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు రంగారావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. గత మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం అందించారు. పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రంగారావుకు కామెర్లతో పాటు కిడ్పీలు పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృత దేహాన్ని పలువురు సందర్శించి, నివాళులు అర్పించడంతో పాటు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.