Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో సీపీఐ(ఎం) జిల్లా నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
ఇండ్ల స్థలాల కోసం కేసులను సైతం లెక్క చేయకుండా పేదల కోసం పోరాడిన వనిత ఉత్పల లక్ష్మీ అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ, దేవులపల్లి యాకయ్య, పట్టణ మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు కూకట్ల శంకర్ అన్నారు. పట్టణంలోని స్టేషన్ బస్తీలో ఇటీవల మరణించిన ఉప్పల లక్ష్మీ సంస్మరణ సభను మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఉప్పల లక్ష్మీ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, వారి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేసులను సైతం లెక్క చేయకుండా పోరాడి ఇండ్ల స్థలాలను సాధించారని ఆ పోరాటంతోనే సబ్ జైలు ఎదురుగా పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు నిర్మించినట్టు తెలిపారు. ఈ సంస్మరణ సభలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు వజ్జ సురేష్, మన్నెం మోహన్ రావు, సీఐటీయూ జిల్లా నాయకులు కూకట్ల శంకర్, శాఖ కార్యదర్శి వాసం రాము, ఐద్వా మండల నాయకురాలు పద్మ, అబ్బాస్, సలీం, వీణ, లక్క రాజేశ్వరరావు, వీరయ్య, కుటుంబసభ్యులు, వారి కుమారుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.