Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హృదయవిధారకమైన సంఘటన
నవతెలంగాణ-చర్ల
మా కుటుంబ పెద్ద దిక్కు అయిన మా నాన్నను క్షేమంగా విడుదల చేయాలంటూ జవాన్ కుమార్తె అభ్యర్థించిన వీడియో ఇప్పుడు యావత్ భారతదేశం లో ఉన్న వాట్స్అప్ గ్రూఫులో వైరల్ అవుతుంది. ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్టులు రాకేష్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ని తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టులు సుకుమా జర్నలిస్ట్‌లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. రాకేశ్వర కుమార్ బతికే ఉన్నాడన్న సంతోషంతో పాటు ఆయన వారి దగ్గర బందీగా ఉన్నారన్న వార్త కుటుంబాన్ని కలచి వేసింది. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు రాకేశ్వర కుమార్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.