Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమానితులపై చర్యలు తీసుకోవాలి
- బాధితుడు పొటిశెట్టి రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండలం, విద్యానగర్ పంచాయతీ, సారయ్య కాలనీలో ఇంటి నిర్మాణం చేస్తున్న క్రమంలో తమ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారని, వారని గుర్తించి న్యాయం చేయాలని బాధితుడు పొటిశెట్టి రమేష్ విజ్ఞప్తి చేశారు. సోమవారం సారయ్య కాలనీలోని ఇళ్లు కూల్చి వేసిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్డాడారు. రమేష్‌లో పాటు ఇస్లావత్ కబీర్ దాస్, సత్తెన పల్లి శ్రీనివాస్‌తో కలిసి సారయ్య కాలనీలో గతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసుకున్నామని, ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి బాగులేక చిన్న రూమ్ నిర్మించుకుంటున్న సందర్భంలో ఆదివారం అర్థరాత్రి కొంత మంది గుర్తు తెలియని దుండగులు ఇంటి నిర్మాణ గోడలు కూల్చివేశారని వాపోయారు. కొందరిని అనుమానితులుగా గుర్తించామని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని ఇక్కడ జరిగే అరచాకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.