Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై పెట్టొద్దన్న నిబందలకు నీళ్ళు
నవతెలంగాణ-అశ్వాపురం
వారంతపు సంత రోడ్డెక్కింది. వేలంపాట నిర్వహించేటప్పుడు పంచాయతీ అధికారులు గంటాపథంగా ప్రతీ సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే సంత ఆర్అండ్బి ప్రధాన రహదారి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డుకిరువైపుల సంత దుకాణాలను నిర్వహించొద్దని నిబందనలలో ఉంది. ఈ మేరకు పంచాయతీ అధికారులు వేలంలో పాల్గొన్న సభ్యులకు నొక్కి ఒక్కాడించి మరి చెప్పారు. వేలం గత వారమే జరిగింది. తొలివారమే రోడ్డుపైకి సంత షాపులన్నీ వచ్చినా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడంతో ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రజలు జనం రద్దీకి తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. కేవలం అధికారుల నిబందనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆచరణలో అవి శూన్యంగా మారుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఇకపై రోడ్డు వెంట షాపులు నిర్వహించకుండా కేవలం బస్స్టాండ్ ఆవరణలోనే పెట్టుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోతున్నారు.