Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండలం, గౌతమ్ పూర్ ఎంపీటీసీ భాగ్య లక్ష్మి మృతి చెందారు. ధన్బాద్లోని వారి ఇంటిలో తెల్లవారు జామున గుండె పోటుతో కన్నుమూశారు. మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు సోమవారం ఎంపీటీసీ ఇంటికి వెళ్లి, ఎంపీటీసీ పార్ధివ దేహానికి పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ బాధవత్ శాంతి, ఎంపీటీసీ అచ్చా నాగమణి, కో-ఆప్షన్ సభ్యులు అరీఫ్ఖాన్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, టీబీజీకేఎస్ నాయకులు ఎండీ. రజాక్, కాపు కృష్ణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఒమర్, అచ్చ నాగరాజు, పాల్గొన్నారు.