Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే తాటి
నవతెలంగాణ-చండ్రుగొండ
అగ్నిప్రమాదంలో మిరపను కోల్పోయిన బాధిత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం అన్నారం తండా గ్రామ శివారులో ఇటీవల అగ్నిప్రమా దంలో కోల్పోయిన మినీ లారీ మిరపకా యలను ఆయన స్వయంగా పరిశీలిం చారు. బాధిత రైతులు మూర్తి వీరన్న, రాజేష్‌లను ఓదార్చారు. అగ్నిప్రమాద గల కారణాలను రైతులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం విద్యుత్ వైర్లను తెలుసుకొని అక్కడి నుండే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. రైతులను ఆదుకునేల కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సుమారు 87 క్వింటాళ్ల మిరప పంటను రైతులు నష్టపోయారని లారీ సైతం ప్రమాదంలో కాలిపోయింది అన్నారు. బాధిత రైతులను తీసుకొని కలెక్టర్, ఐటీడీఓ పీఓను కలిసి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కిందకి వేలాడుతున్నా కరెంటు వైర్లను వెంటనే మరమ్మతులు చేయాలని, ప్రమా దం జరిగినప్పుడు స్పందించే కన్నా ముం దుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, ఎంపీటీసీ భూక్య రాజి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ బొజ్జ నాయక్, ప్రధాన కార్యదర్శిచి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.