Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై సోమవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.... దుమ్మగూడెం అటవీ రేంజ్ పరిధిలోని సుజ్ఞానపురం ఫారెస్ట్ బీట్ పరిధిలోని అటవీ భూమిలో అధికారుల ఆదేశాల మేరకు సుజ్ఞానపురం ఎఫ్బీఓ భూక్య విజయ ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా 6 ట్రాక్టర్లుతో భూమిని చదును చేయిస్తుండగా పైడిగూడెం, తొగ్గుడెం గ్రామస్తులు 13 మంది కలిసి అట్టి భూమిలోకి ప్రవేశించి ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి విధులకు ఆటంకం కలిగించి, భయబ్రాంతులకు గురిచేశారని అధికారుల ఆదేశాలపై సోమవారం స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అయన తెలిపారు.